Heavy Rains in Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఈ ఉదయం కురిసిన భారీ వర్షంతో తడిసిముద్దయిన నగరం... ఈ సాయంత్రం కురిసిన వర్షంతో అతలాకుతలమైంది. పలుచోట్ల వర్షం నీరు రోడ్ల పైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్
జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి వర్షానికే ఇంకా నగర వాసులు కోలుకోలేదు. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు.
కాగా వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటికి నీరు దాదాపుగా ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా, మధ్యాహ్నం సమయానికి 513.63 అడుగులకు నీరు చేరుకుంది.
Here's Video
సాగర్‌లోకి 1850 క్యూసెక్కుల నీరు వస్తుండగా, గేట్లు ఎత్తి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.