Hyd, August 20: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం, గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 24న ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రం మీదుగా కొనసాగిన ఆవర్తనం, ద్రోణి ఈ రోజు బలహీన పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ బంగ్లాదేశ్‌లో అల్పపీడనం, దేశ వ్యాప్తంగా ఆగస్టు 24 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై(Heavy rains) సీఎస్ శాంతి కుమారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) జిల్లా కలెక్టర్లతో(collectors )వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకాలు వచ్చే ఐదు రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలి.
గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా వీలైనంత మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీస్కోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని గురించి మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.