
New Delhi, August 19: దేశంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.రానున్న నాలుగు రోజుల పాటు జమ్మూ, లక్షద్వీప్‌లతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య నుంచి ఈశాన్యం, దక్షిణ భారతదేశంతో సహా దేశంలోని చాలా ప్రాంతాలలోరుతుపవనాలు చురుకుగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
ఆదివారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా సహా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు(rains) కురిశాయి. అయితే రానున్న నాలుగు రోజుల పాటు జమ్మూ, లక్షద్వీప్‌లతో పాటు దేశవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం ఉదయం వర్షం కారణంగా వాహనాల రాకపోకల కోసం 95 రోడ్లను మూసివేశారు. ఒడిశాలో పిడుగుపాటుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
జమ్మూ డివిజన్‌లో ఆగస్టు 19 వరకు, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఆగస్టు 21 వరకు, ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 24 వరకు, పంజాబ్, హర్యానా-చండీగఢ్‌లలో ఆగస్టు 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఆగస్టు 21 నుంచి 24 వరకు, తూర్పు రాజస్థాన్‌లో ఆగస్టు 22 నుంచి 24 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇదే సమయంలో తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆగస్టు 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయని సిమ్లాకు చెందిన వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
IMD ప్రకారం దక్షిణ బంగ్లాదేశ్‌లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగస్టు 20 వరకు పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది కాకుండా సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లో కూడా ఆగస్టు 21 వరకు అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 20న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గోవా, బీహార్, జార్ఖండ్, ఒడిశా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పుదుచ్చేరి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది.