Rains In Hyderabad: భారీ వర్షంతో భాగ్యనగరం అతలాకుతలం.. రోడ్లపైకి చేరిన నీరు... భారీగా నిలిచిన ట్రాఫిక్.. ఈదురుగాలులతో విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ

వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి.

Representational Image (File Photo)

Hyderabad, May 1: హైదరాబాద్ (Hyderabad) ను మరోసారి భారీ వర్షం (Heavy Rain) అతలాకుతలం చేసింది. వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవ్వడంతో పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై (Roads) పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా (Electricity Supply) నిలిచిపోయింది. ట్రాఫిక్ (Traffic) కు అంతరాయం కలిగింది. భారీ వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఈ మేరకు 040 211 11111 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

CSK vs PBKS: పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ పర్మామెన్స్, చివరిబాల్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం

ఏఏ ప్రాంతాల్లో భారీ వర్షం అంటే?

ఎర్రగడ్డ, సనత్ నగర్, మల్లాపూర్, మోతీనగర్, జీడిమెట్ల, కాచిగూడ, దిల్ సుఖ్ నగర్, ఖైరతాబాద్, సుచిత్ర, సూరారం, గోల్నాక, యూసఫ్ గూడ, లక్డీకాపూల్, వనస్థలిపురం, మల్లాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, విద్యానగర్, ఎల్బీనగర్, కాచిగూడ, అమీర్ పేట, బోరబండ, గచ్చిబౌలి, అంబర్ పేట, రాయదుర్గం, హబ్సిగూడ, తార్నాక, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Dhee Choreographer Suicide: ఢీ కొరియోగ్రాఫర్ లైవ్‌ సూసైడ్‌, అప్పులు కట్టలేక చనిపోతున్నా అంటూ వీడియో, ఢీ షో కంటే జబర్ధస్త్‌లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయ్!