IPL Auction 2025 Live

Hyderabad Rains: ఇంటికి వెళ్లేవారు జాగ్రత్త, హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం, క్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

మణికొండ, షేక్‌పేట, టోలీచౌకీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మలక్‌పేట, షైక్‌పేట, మాదాపూర్‌, మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌, మసబ్‌ట్యాంక్‌ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

Rains Lash Telangana (Photo-Video Grab)

హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలో కొద్ది సేపటి క్రితం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. పొద్దంతా మేఘావృతమై ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మణికొండ, షేక్‌పేట, టోలీచౌకీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, మలక్‌పేట, షైక్‌పేట, మాదాపూర్‌, మెహదీపట్నం, రాయదుర్గం, గచ్చిబౌలి, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌, ఖైరతాబాద్‌, మసబ్‌ట్యాంక్‌ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

తెలంగాణకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ, రానున్న మూడు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. అయితే, ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు రాబోయే ఒకటి, రెండు గంటల్లో హైదరాబాద్‌ నగరంలో పశ్చిమ, మధ్య, ఉత్తర హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.