Heavy Rain in Hyd: హైదరాబాద్ నగరాన్ని మళ్లీ కుమ్మేసిన భారీ వర్షం, పలు చోట్ల వర్షపు నీరు రహదారులపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
ఉదయం కాస్త ఎండ, చల్లని వాతావరణం ఏర్పడిన హైదరాబాద్‌లో.. మధ్యాహ్నం సమయానికి వాన దంచికొట్టింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది.
Hyd, Oct 10: హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ, చల్లని వాతావరణం ఏర్పడిన హైదరాబాద్‌లో.. మధ్యాహ్నం సమయానికి వాన దంచికొట్టింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. పలు చోట్ల వర్షపు నీరు రహదారులపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా వర్షాలు కుండపోతగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.