Hyderabad Rain: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు

మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Hyderabad Rains (Photo-X)

Hyd, August 20: గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. తెల్లవారుజామున మొదలైన వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

పంజాగుట్టలోని సుఖ్‌ నివాస్‌ అపార్టుమెంటు వద్ద కారు షెడ్డుపై పిడుగుపడడంతో లోపల పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్లపై వరద భారీగా ప్రవహిస్తోంది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుడిని రాంనగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు.  దక్షిణ బంగ్లాదేశ్‌లో అల్పపీడనం, దేశ వ్యాప్తంగా ఆగస్టు 24 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మలక్ పేట అజాంపుర, డబీర్ పురా వద్ద వరద కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాంనగర్ లో స్కూటీపై వెళుతున్న వ్యక్తి వరదనీటిలో పడిపోయాడు. వరదనీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Here's Videos

అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో మోకాలిలోతు వరకు నీరు చేరింది. ముసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.

తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాల్లోని స్కూళ్లకు ఈ నేపథ్యంలో నేడు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాలోని పరిస్థితులకనుగుణంగా అన్ని జిల్లాల అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

పలు ప్రాంతాల్లో వర్షానికి చెట్లు పడిపోవడంతో ఆయా ఏరియాల్లో మరమ్మతుల కారణంగా కరెంటును నిలిపివేశారు. ఇక వర్షం ధాటికి వాహనాలు.. వాహనాలతో పాటు మనుషులు సైతం కొట్టుకుపోతున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతుండటంతో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్‌కు వచ్చి చేరుకుంటోంది. దీంతో అధికారులు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతవాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇక మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మునిగిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి హఫిజ్ పేట్, మాదాపుర్, గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి వచ్చి చేరుతోంది. గచ్చిబౌలి సుదర్శన్ నగర్ కాలనీలో వరద నీరు భారీగా చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. హఫిజ్ పేట్ నుంచి మాదాపుర్ హైటెక్ సిటీ మార్గంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif