Amit Shah Telangana Tour Schedule: అమిత్‌ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, 23న చేవెళ్ల సభలో పాల్గొనననున్న కేంద్ర హోం మంత్రి HYd, April 21: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఈనెల 23 న మరోసారి

తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. కాగా అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది.

Home Minister Amit Shah (Photo Credit: ANI)

HYD, April 21: తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్బంగా బీజేపీ తలపెట్టిన చేవెళ్ల సభలో పాల్గొంటారు. అలాగే, నోవాటెల్‌ హోటల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. కాగా అమిత్‌షా తెలంగాణ పర్యటన అటు రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పెంచబోతోంది.

వాతావరణ శాఖ గుడ్ న్యూస్, కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు కురిసే అవకాశం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలు ప్రచార దూకుడు పెంచాయి. ఇలాంటి సమయంలో 23న చేవెళ్ల సభలో అమిత్‌షా ఏం మాట్లాడుతారనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ.. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా ఈ సభ ఉండొచ్చని బీజేపీ అధికార వర్గాలు చెప్తున్నాయి.

అమిత్‌ షా తెలంగాణ షెడ్యూల్‌ ఇదే..

- ఆదివారం(23న) మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

- మధ్యాహ్నం 3.50 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు.

- సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశం అవుతారు.

- సాయంత్రం 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అవుతుంది.

- సాయంత్రం 5.15 గంటలకు అమిత్‌ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు.

- సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొంటారు.

- తిరిగి రాత్రి 7.45 గంటలకు అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢిల్లీకి పయనమవుతారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement