IPL Auction 2025 Live

Liquor Outlets to be Closed: మద్యం షాపులు 2 రోజులు బంద్, హోలీ పండుగ సందర్భంగా జంటనగరాల్లో పోలీసుల నిర్ణయం, షాపుల ముందు క్యూకట్టిన మద్యం ప్రియులు

పండుగ సందర్భంగా తాగి ఎలాంటి గొడవలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు (Telangana police) ఆంక్షలు విధించారు.

Liquor Bottles | Image used for representational purpose only | Photo- Pixabay

Hyderabad, March 17: హోలీ (Holi) పండుగకు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నవారికి షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. పండుగ సందర్భంగా తాగి ఎలాంటి గొడవలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు (Telangana police) ఆంక్షలు విధించారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. హోలీ సందర్భంగా ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు (Liquor outlets), బార్లు (Bars), క్లబ్ లు మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో తిరిగి ఆదివారం నాడు షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే రెండు రోజుల మద్యం ఆదాయం తగ్గుతుండటంతో షాపుల యజమానులు కూడా ఆవేదన చెందుతున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, గుంపులు గుంపులు తిరుగుతూ.. న్యూసెన్స్ చేయవద్దని సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 75 కేసులు, గత 24 గంటల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 34 మందికి కరోనా

హొలీ సందర్భంగా పోలీసులు తీసుకున్న నిర్ణయంతో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త పడుతున్నారు. పండగకోసం మద్యం కొనుగోలు చేసేందుకు షాపుల మందు బారులు తీరారు. అయితే కేవలం జంటనగరాల పరిధిలోనే ఈ ఆంక్షలు ఉండటంతో పలువురు శివార్లలో హోలీ సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.