Telangana Shocker: నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్, పిల్లలను బాగా చూసుకోమంటూ..ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన

నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్‌ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Husband Decesed Life) పాల్పడ్డాడు.

Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Mar 14: సూర్యాపేట జిల్లా కోదాడలోన విషాద ఘటన చోటు చేసుకుంది. నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్‌ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Husband Decesed Life) పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్‌(32) టాటాఏస్‌ వాహనం డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. లాక్‌డౌన్‌ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు.

పని లేకపోవడం.. తాగుడుకు అలవాటుపడిన అశోక్‌ భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. శుక్రవారం రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లలను మంచిగా చూసుకో అని భార్యకు వీడియో కాల్‌ (Video Calling To Wife) చేసి చెప్పాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చూసేవరకు అప్పటికే అశోక్‌ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి దావిద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ సైదా తెలిపారు.

ఇక సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని అల్లాపూర్‌లోపెళ్లైన మూడురోజులకే కొత్త పెళ్లికొడుకు మృత్యుఒడికి చేరుకున్నాడు. చెరువులో పడిన తన అన్న కుమారుడిని రక్షించే యత్నంలో బురదలో ఇరుక్కొని కన్నుమూశాడు. గ్రామానికి చెందిన మౌలాన్‌సాబ్, జహీరాబీ దంపతులు తమ ఐదుగురు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. చిన్న కుమారుడు యాసిన్‌ (23) వివాహం గురువారం నగరంలో ఘనంగా జరిపించారు. ఈ క్రమంలో స్వగ్రామంలో గ్రామస్తులకు, బంధువులకు ఆదివారం విందు ఏర్పాటు చేయాలని భావించి అందుకు సంబంధించిన ఏర్పా ట్లు చేశారు.

నాలుగేళ్ల బాలిక రేప్‌కు సహకరించలేదని గొంతు కోసి చంపేసిన కామాంధుడు, చిన్నారి మృతదేహం చూసి తట్టుకోలేక విషం తాగిన తండ్రి, దాద్రానగర్‌ హవేలీలో అమానుష ఘటన

ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కలిసి శనివారం మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లి సరదాగా గడపసాగారు. అంతలోనే యాసిన్‌ అన్న కుమారుడు సమీర్‌ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. దీంతో వెంటనే యాసిన్‌ అతడిని కాపాడే యత్నం చేశాడు. ఈక్రమంలో చెరువులోని గుంతలో ఇరుక్కుపోయాడు. గట్టున ఉన్న కొందరు సమీర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు.

కొద్దిసేపటికి గ్రామస్తులు అక్కడికి చేరుకొని యాసిన్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న కొత్తపెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం బాలంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడు సమీర్‌ క్షేమంగా ఉన్నాడు. మృతుడి తండ్రి మొగులాన్‌సాబ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.