Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌, ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే, మే 5 నుంచి అమల్లోకి..

ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు (First-class tickets in MMTS) దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి (cheaper by 50% from May 5) రానున్నాయి.

MMTS(Photo-Twitter/South Central Railway)

Hyd, May 4: ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ఫస్ట్‌క్లాస్‌ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు (First-class tickets in MMTS) దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి (cheaper by 50% from May 5) రానున్నాయి. గ్రేటర్‌లో సబర్బన్‌ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్‌లో (MMTS) ఫస్ట్‌ క్లాస్‌లో ప్రతి సింగిల్‌ రూట్‌ ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

ఈ మేరకు గ్రేటర్‌లోని సికింద్రాబాద్‌– లింగంపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్‌– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్‌నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్‌ వరకు 29 స్టేషన్‌ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. 50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్‌ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు.

కడుపులో రూ.11.53 కోట్లు విలువ గల డ్రగ్స్‌, టాంజానియా దేశస్థుడు పొట్టలో నుండి 108 క్యాప్సూల్స్‌‌ని తీసిన కస్టమ్స్‌ అధికారులు, ఎన్పీడీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు

వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్‌ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు