Drugs. Image Used For Representational Purpose Only. (Photo Credits: Pixabay)

Hyd, May 4: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి హెరాయిన్‌ (Heroin) పట్టుబడింది. జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద మత్తుమందు పట్టుబడింది. గత నెల 26న జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి . టాంజానియా దేశస్థుడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో (Hyderabad Airport) కస్టమ్స్‌ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో పట్టుకున్నారు. నిందితుడు 108 క్యాప్సూల్స్‌ మింగినట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో వాటిని వెలికితీశారు. అవి 1389 గ్రాముల బరువు ఉన్నాయని, వాటి విలువ రూ.11.53 కోట్లు ఉంటుందని (Heroin worth Rs.11.53 crore seized) అధికారులు తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నామన్నారు.

కడుపులో డ్రగ్స్‌ రవాణా చేయడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.నిందితుడు జోహెన్స్‌బర్గ్‌ నుంచి అబుదాబీ మీదుగా వచ్చాడని అధికారులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, కోర్టు అనుమతితో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్యాప్సూల్స్ రూపంలో దాచిన డ్రగ్స్ సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు. నిందితుడిపై ఎన్పీడీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

అకాల వర్షాలతో రైతన్న విలవిల, పలు జిల్లాల్లో తడిసిపోయిన ధాన్యం, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షాలు, మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు

కాగా గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ.200 కోట్ల విలువగల కొకైన్, హెరాయిన్‌ తదితర మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), కస్టమ్స్‌ విభాగాలు సీజ్‌ చేశాయి. ళఇదిలా ఉంటే సూట్‌కేసు, ఇతర పద్ధతుల్లో తెచ్చే వారికి ప్రతి ట్రిప్‌కు రూ. లక్షన్నర, కడుపులోకి పెట్టుకొని తీసుకొచ్చే వారికి రూ. 3 లక్షల వరకు ఇస్తున్నట్టు తెలిసింది. కడుపులో పెట్టుకొని డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తంలో దొరక్కుండా స్మగ్లింగ్‌ చేయొచ్చని, పైగా దీని వల్ల ప్రాణాలకు ప్రమాదమూ ఎక్కువ కాబట్టి ఎక్కువగా డబ్బులిస్తున్నారని వెల్లడైంది. పైగా కడుపులోకి పెట్టుకొని తీసుకువచ్చే వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్టు కూడా డీఆర్‌ఐ గుర్తించింది. స్మగ్లింగ్‌ చేసే వాళ్లకు విమాన చార్జీలు, వసతి సౌకర్యాలు కాకుండానే ఈ సొమ్ము ఇస్తారని వెల్లడైంది.

హత్యా, ఆత్మహత్యా.. తెలంగాణలో జంట మృత‌దేహాల క‌ల‌క‌లం, కొత్తగూడెం బ్రిడ్జ్‌ సమీపంలో గుర్తు పట్టడానికి వీలులేకుండా కుళ్లిన స్థితిలో యువతి, యువకుడి శవాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

డ్రగ్స్‌ కేసుల్లోని నిందితులు దక్షిణాఫ్రికా నుం చి హైదరాబాద్‌ వచ్చినవారే కావడం ఆందో ళన కలిగిస్తోంది. ఈ నెల 1న దక్షిణాఫ్రికా దేశస్థుల నుంచి రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. గత ఏప్రిల్‌లో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్‌ టాబ్లెట్లు, రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూన్‌లో రూ.78 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్‌ పట్టుబడగా, ఆ నెలలోనే మరో కేసులో రూ.19.5 కోట్ల విలువైన 3 కేజీల హెరాయిన్‌ పట్టుబడింది. భారీగా పట్టుబడిన కేసుల్లోని డ్రగ్స్‌ విలువ దాదాపు 200 కోట్లుంటే, చిన్నిచితకా కేసులన కలిపితే మరో రూ. 50 కోట్ల మేర ఉం టుందని డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు.