Rains Lash Telangana (Photo-Video Grab)

Hyd, May 4: భారీ వర్షంతో తెలంగాణ తడిచి ముద్దయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినన వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పలుచోట్ల చెట్లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు (Rains Lash Telangana) జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగుతున్నాయి.

వర్ష బీభత్సానికి విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రంగంలోకి జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. వర్షానికి చార్మినార్‌, మలక్‌పేట్‌, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లో హోర్డింగ్స్‌ కూలిపోయాయి. కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

అత్యధికంగా సీతాఫల్‌మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం (Heavy rains Lash in Hyd) నమోదయింది. ఇక బన్సీలాల్‌పేటలో 6.7, వెస్ట్‌ మారేడుపల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్‌లో 5.8, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావ్‌ నగర్‌లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, గుడిమల్కాపూర్‌, నాచారంలో 4.1, అంబర్‌పేటలో 4, అమీర్‌పేట, సంతోష్‌నగర్‌లో 3.7, ఖైరతాబాద్‌లో 3.6, బేగంబజార్‌, హయత్‌నగర్‌, చిలుకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

Here's Rain Updates

సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, నాగోల్‌, వనస్థలిపురం, తుర్కయంజాల్‌, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం‌, తిరుమలగిరి, అల్వాల్‌, కంటోన్మెట్‌, మల్కాజిగిరి, ముషీరాబాద్‌, నాగోల్‌, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, కుషాయిగూడ, ఈసీఐఎల్‌‌, కాప్రాలో ఉరుములతోకూడి భారీ వర్షం కురిసింది.

హత్యా, ఆత్మహత్యా.. తెలంగాణలో జంట మృత‌దేహాల క‌ల‌క‌లం, కొత్తగూడెం బ్రిడ్జ్‌ సమీపంలో గుర్తు పట్టడానికి వీలులేకుండా కుళ్లిన స్థితిలో యువతి, యువకుడి శవాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భారీ వర్షంతో ఎల్బీనగర్‌, కొత్తాపేట్‌ రైతుబజార్‌, చైతన్యపురి, మలక్‌పేట్‌ గంజ్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, మారేడ్‌పల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బంజారాహిల్స్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌లో రోడ్లు జలమయమయ్యాయి. వర్షపు నీటికి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో మియాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌లో ముందుజాగ్రత్తగా అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. యూసుఫ్‌గూడ, మైత్రివనం స్టేట్‌హోం, చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

Heavy rain in Hyd

తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ( continue for next three days) ఉన్నదని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు. కాగా, ఒక్కసారిగా వాన కురియడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.

Hyd Rains

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోయింది, మామిడి నేలరాలింది. కరెంట్‌ స్తంభాలు విరిగిపోయాయి. జగిత్యాలలో పిడుగుపాటుకు ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి. ఉమ్మడి జిల్లాలోని బీర్పూర్‌, వెల్గటూర్‌, గొల్లపల్లి, కోనరావుపేట, గోదావరిఖని, గంగాధర, మానకొండూరు, రామడుగు మండలాల్లో భారీగా వర్షం కురిసింది. బీర్పూర్‌ మండలంలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.

పెద్దపల్లి జిల్లాలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాల్లో భారీ వాన కురిసింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి మంథని, పెద్దపల్లిలోని మార్కెట్‌ యార్డుల్లో, పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్‌, మల్యాల మండలంలో జోరుగా వానపడింది. మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపడి ఇద్దరికి గాయాలయ్యాయి. 43 మేకలు మృతిచెందాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. కుమ్రం భీమ్‌, మంచిర్యాలలో భారీ వానపడింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో ఈదురు గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి.

150 దేశాలను వణికించి వచ్చా.. కేసీఆర్, కేటీఆర్‌లకు భయపడే ప్రసక్తే లేదు, పోలీసులు హౌస్ అరెస్టు అనంతరం మండిపడిన కేఏ పాల్‌

నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తున్నది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే భారీ వర్షానికి పలు మండలాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ సెంటర్లలో ముమ్మరంగా కొనుగోళ్లు జరుగుతుండగా ధాన్యం పెద్ద ఎత్తున కేంద్రాలకు వస్తుంది. ఇప్పటికే కొనుగోలు చేసినదానితోపాటు, కేంద్రాల వద్ద ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం కూడా భారీగానే ఉన్నది. ఇక కోతకు సిద్ధంగా చేలపై వరి సిద్ధంగా ఉన్నది. ఈ వర్షంతో చేను నేలబారి వడ్లు రాలే ప్రమాదం ఉన్నది.