Hyderabad: రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారం పట్టివేత, ఎయిర్‌ కంప్రెషర్‌ లోపల పెట్టి తరలిస్తుండగా పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని ( Gold Worth Rs 4 Crore Seized) క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు.

Gold Seized (photo credit- ANI)

Hyd, Oct 7: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Rajiv Gandhi International Airport) దుబాయ్‌ నుంచి వ‌చ్చిన ఓ ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ. 4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని ( Gold Worth Rs 4 Crore Seized) క‌స్ట‌మ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్‌ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో భారీగా బంగారాన్ని త‌ర‌లిస్తున్న‌ట్లు క‌స్ట‌మ్స్ అధికారుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముగ్గురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేశారు.

అందులో ఒక ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా రూ.2,57,47,700 విలువైన 4895.000 గ్రాముల బంగారాన్ని ఎయిర్‌ కంప్రెషర్‌లోపల పెట్టి తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదే విమానం నుంచి వచ్చిన మరో వ్యక్తి తన లగేజి తీసుకుని కస్టమ్స్‌ గ్రీన్‌ చానల్‌ను దాటేందుకు యత్నించగా అనుమానం వచ్చిన అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతడి వద్ద 24 క్యారెట్ల 12 బంగారం బిస్కెట్లు లభించాయి. 1400 గ్రాములు ఉన్న ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని విచారిస్తున్నారు.

హమ్మో.. ఇదెక్కడి మోసం.. పాత కరెన్సీని స్వామీజీ కొత్తనోట్లుగా మారుస్తాడని ప్రచారం.. రూ.1.65 కోట్ల పాతనోట్ల పట్టివేత!

మ‌రో వ్యక్తి తన లగేజితో కస్టమ్స్‌ గ్రీన్‌ ఛానెల్‌ దాటేందేకు యత్నిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు సదరు వ్యక్తిని తనిఖీచేయగా 1400 గ్రాముల 12 బంగారం బిస్కెట్లు(24క్యారెట్లు) లభించాయి. ఈ మేరకు ముగ్గురు నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4కోట్ల విలవ చేసే 7.695 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.