Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్‌ (వీడియో)

హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోరం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓ ఆర్మీ జవాన్‌ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

Jawan Dead (Credits: X)

Hyderabad, Mar 5: మానవత్వం మంటగలిసింది. దేశాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయని జవాన్ (Jawan)..  రోడ్డుమీద తీవ్ర గాయాలతో పడిఉన్నా ఒక్కరూ స్పందించలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ (Hyderabad) నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై (ORR) వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం.. ఓ ఆర్మీ జవాన్‌ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. బాధితుడిని రాందేవ్‌ గూడ ఆర్టిలరీ సెంటర్‌లో జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్న కులాన్‌(34)గా గుర్తించారు.

Modi Ka Parivar Campaign: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోదీ కా పరివార్, లాలూ ప్రసాద్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బీజేపీ అగ్రనేతలు, విషయం ఏంటంటే..

రోడ్డుమీద పడిఉన్నా..

జవాన్ మరణానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు ఆ మార్గంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా తీవ్ర గాయాలతో కులాన్ రోడ్డుమీద పడిఉన్నా అటువైపు వెళ్తున్న ఏ ఒక్కరూ సాయం చేయకపోవడం కంటతడి పెట్టిస్తున్నది.

దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే, ప్రతిపక్షాల వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ప్రధాని మోదీ, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని వెల్లడి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement