Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు

హైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Representative Image (Photo Credit: PTI)

Hyd, Feb 14: హైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. హుమాయున్ న‌గర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్ట‌ర్‌ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీలో నివసించే మసూద్(43) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి, ప్రేమోన్మాది తనకు దక్కలేదనే కోపంతో కక్షకట్టి మరీ..

ఇతను 2018 ఏప్రిల్ 25వ తేదీన మెహిదీపట్నం ఫిల్టర్ బెడ్స్ ప్రాంతంలో నివసించే ఓ బాలుడిని ఆటోలో బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణమైన పద్దతిలో అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు నొప్పితో అరుస్తున్నా నోరు కప్పెట్టి తన కామవాంఛను తీర్చుకున్నాడు. అనంతరం ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హుమాయున్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా గురువారం ఈ కేసులో పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ 12వ కోర్టు జడ్జి అనిత నిందితుడిని దోషిగా గుర్తించి (Man convicted of raping minor boy) 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Hyderabad Accident: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌ దిమ్మెల్ని ఢీకొట్టి భయోత్పాతం (వీడియో)

Laila Movie Review in Telugu: లైలా మూవీ రివ్యూ ఇదిగో, విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే?

GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..

Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

Share Now