Telangana: తాగిన మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి కరెంట్ తీగలు పట్టుకున్నాడు, ఒక్కసారిగా షాక్ కొట్టడంతో పైనుంచి రోడ్డు మీద పడి అక్కడికక్కడే మృతి, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన
రాజధానిలోని సైదాబాద్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హైటెన్సన్ వైర్లను తాకి ఆత్మహత్య (Hyderabad Man Ends His Life) చేసుకున్నాడు.
Hyderabad, June 1: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజధానిలోని సైదాబాద్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హైటెన్సన్ వైర్లను తాకి ఆత్మహత్య (Hyderabad Man Ends His Life) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అక్కడి పోలీసులు తెలిపిన మేరకు.. అక్బర్‌బాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే అక్బర్ (40) రెండు పెళ్లిళ్లు కాగా మొదటి భార్య అజ్మరీతో కలిసి ఉంటున్నాడు.
నిత్యం మద్యం తాగి భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తూ ఉండేవాడు. రోజు లాగే సోమవారం మధ్యాహ్నం కూడా మద్యం తాగి (drink alchol ) ఇంటికి వచ్చిన అతను భార్యతో గొడవపడ్డాడు. అదే కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చి దిల్‌కుష్ ఫంక్షన్‌హాల్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ పైకి ఎక్కాడు. కింద ఉన్నవారు ఎంత వారిస్తున్నా వినకుండా అక్కడి విద్యుత్ వైర్లను (Touching power Transformer) తాకాడు.
హైటెన్సన్ వైర్లు కావడంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌తో అతను అంత ఎత్తు నుండి ఒక్కసారిగా రోడ్డుపైకి పడిపోయాడు. తీవ్రమైన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.