Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్

తాజాగా ఈ సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Hyderabad: Municipal officials dismantle 80-meter portion of solar-powered cycling track along ORR Watch Video

Hyd, Dec 17: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ను నార్సింగ్ లో ఏర్పాటు చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ సైకిల్ ట్రాక్ ను తొలగిస్తున్నారు అధికారులు.సైకిల్ ట్రాక్ ను జేసీబీ సాయంతో తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా కొంతవరకు తీసేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం, కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ ని 2023 అక్టోబర్ 1న నాటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.హెచ్ఎండీఏ నిర్మిచిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలో మొదటిదిగా చెప్పుకోవచ్చు. నానక్ రామ్ గూడ నుంచి టీఎస్పీఏ వరకు 9 కిలోమీటర్లు , నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు మేర మూడు లేన్ లతో ఈ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు. 4.5 మీటర్స్ వెడల్పు ట్రాక్, ఇరువైపులా ఒక మీటర్ గ్రీన్ స్పేస్ ,21 కిలోమీటర్ల సోలార్ రూఫ్ తో పాటు... లైట్స్ ఏర్పాటు చేశారు.సైక్లిస్ట్ లకోసం పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

భారత్‌లో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌

23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ లో 21 కిలోమీటర్లు సోలార్ రూఫ్ టాప్.. మరో రెండు కిలోమీటర్లు నాన్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు.దీని వల్ల 16 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఒక మెగావాట్ సోలార్ పవర్ ను సైకిల్ ట్రాక్ కోసం ఉపయోగించనున్నారు, మిగతా 15 మెగావాట్ల విద్యుత్ ను అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న విద్యుత్ దీపాలకు ఉపయోగించనుంది హెచ్ఎండీఏ. ఈ ట్రాక్ 24గంటలు అందుబాటులో ఉండనుంది. ట్రాక్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అయితే ట్రాఫిక్ కు ఆడ్డంకి ఉన్న కార‌ణంగా ఈ ట్రాక్ తొల‌గించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీనిపై బిఆర్ఎస్ నేత‌లు మండిపడుతున్నారు. సైకిల్ ట్రాక్ తో పాటు సోలార్ విద్యుత్ టవ‌ర్స్ ను ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్ర‌భుత్వ ఆనవాళ్ల‌ను చేరిపి వేసే క్ర‌మంలోనే ఈ ట్రాక్ ను తొల‌గిస్తున్నార‌ని ఆరోపించారు. దేశంలోనే తొలి సోలార్ సైకిల్ ట్రాక్ ను ఏర్పాటు చేసిన వ్య‌క్తిగా కెసిఆర్ నిలిచార‌ని, ఇప్పుడు ఆయ‌న నిర్మించిన ఈ ట్రాక్ ను తొల‌గించ‌డం క‌క్ష సాధింపు చ‌ర్య‌నంటూ ధ్వ‌జ‌మెత్తారు.