PM Modi Hyd Visit: ISB వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్‌గా ఐఎస్‌బీ ఎదిగిందని కితాబు
ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Minister Talasani) హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగింస్తున్నారు.
Hyd, May 26: ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Minister Talasani) హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగింస్తున్నారు. అనంతరం 10 మందికి గోల్డ్‌మెడల్స్, పట్టాలు ప్రధాని అందజేయనున్నారు. ఆ తర్వాత ISB ఆవరణలో మోదీ మొక్క నాటనున్నారు. కాగా.. మొత్తం భాగ్యనగరంలో రెండున్నర గంటలపాటు మోదీ పర్యటన జరగనుంది.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఐఎస్‌బీ తన ప్రయాణంలో కీలక మైలురాయికి చేరిందన్నారు. 2001 లో వాజ్‌పేయ్ ఐఎస్‌బీని ప్రారంభించారని తెలిపారు.ఎంతోమంది కృషి వల్లే ఐఎస్‌బీ ఈ స్థాయికి చేరిందన్నారు. ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్‌గా ఐఎస్‌బీ ఎదిగిందన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు అనేక స్టార్టప్‌లు ప్రారంభించారని పేర్కొన్నారు.