Hyd, May 26: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్‌కు (Hyderabad City) చేరుకున్నారు. మోదీకి.. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం అయ్యారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు (PM Modi Hyderabad Visit) వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సభా వేదికలో ప్రధాని మోదీ ప్రసంగం సుమారు 30 నిమిషాలపాటు సాగింది. ఈ ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు ప్రధాని మోదీ.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన.. తెలుగు మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ ప్రజలకు నమస్కారం..’ అని ప్రసంగాన్ని ప్రారంభించి.. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని మోదీ చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఎప్పుడొచ్చినా ప్రజల రుణం పెరిగిపోతుందని అనిపిస్తోందన్నారు. ఇక్కడి ప్రజలు చూపించే అభిమానం, ఆప్యాయతలకు రుణపడి ఉంటానని మోదీ నమస్కరించి చెప్పారు.
బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర ఈ స్వాగతాన్ని చూశాక బీజేపీ పోరాటం ఫలితాన్నిస్తోందని అర్థమవుతోంది. ఇక తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. తెలంగాణలో మార్పు తథ్యం. ఒక్క కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అణిచివేయాలని చూస్తోంది. కుటుంబ పార్టీలు దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఒక్క కుటుంబం సంక్షేమం కోసమే కొన్ని పార్టీలు పని చేస్తున్నాయి. ఇంత ఎండలో చెమటలు కారుస్తూ వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీ ప్రేమే నా బలం. తెలంగాణకు ఎప్పుడొచ్చినా మీ రుణం పెరిగిపోతోంది అనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు
ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. ఆయనకు స్వాగతం చెబుతూ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే అక్కడక్కడ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మొత్తం పదిహేడు చోట్ల ప్రధానిని ప్రశ్నిస్తూ.. ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలంటూ టీఆర్‌ఎస్ నేతలు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.