Child Selling Racket Busted in Hyderabad: పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేసిన రాచకొండ పోలీసులు, 16 మంది చిన్నారులను రక్షించామని తెలిపిన సీపీ తరుణ్ జోషి
పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.
Hyd, May 28: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. వీడియో ఇదిగో, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, భారీ స్థాయిలో నగదు స్వాధీనం, ఏజెంట్లు అరెస్ట్
ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధరించారు. మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్‌లో ఘటన వెలుగులోకి వచ్చింది.
Here's Videos
కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు. 13మంది చిన్నారులను కాపాడి 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఢిల్లీ, పూణే నుంచి ఏడాది లోపు ఉన్న పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిందితులు అమ్మకాలు చేశారు. సంతానం లేని వారికి ఒక్కొ చిన్నారిని రూ.1.80 లక్షల నుంచి రూ.3.5లక్షలకు అమ్మినట్లు సీపీ తెలిపారు.ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామన్నారు.