Coronavirus in TS: సీఎం కేసీఆర్‌కు కరోనా అంటూ ఫేక్ వార్త, లోకల్ జర్నలిస్టుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా (TS CM KCR) అంటూ తప్పుడు వార్తలు రాసిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరితో పాటు పత్రిక యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదాబ్ హైదరాబాద్ (Aadab hderabad) అనే పత్రికలో రెండు రోజుల క్రితం "సీఎం కేసీఆర్‌కి కరోనా" ."హరితహారం కార్యక్రమంలో సోకిందా" అంటూ వార్త ప్రచురించారు. సీఎం కేసీఆర్ జలుబు తదితర లక్షణాలతో బాధపడుతున్నాడని, క్వారన్ టైన్ లో చికిత్స అని, ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా (Pragati Bhavan) అంటూ వార్తలో స్టోరిని రాశారు. ఈ విషయాన్ని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న మహ్మద్ ఇలియాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త (TRS activist) చూశాడు. తన స్నేహితులతో వాకబు చేశారు. ఇలాంటి వార్త ఏది అధికారులు ధ్రువీకరించలేదని, తప్పుడు వార్త కావొచ్చు అని వారు చెప్పారు.

Telangana CM KCR | Photo: CMO

Hyderabad, July 6: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా (TS CM KCR) అంటూ తప్పుడు వార్తలు రాసిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరితో పాటు పత్రిక యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదాబ్ హైదరాబాద్ (Aadab hderabad) అనే పత్రికలో రెండు రోజుల క్రితం "సీఎం కేసీఆర్‌కి కరోనా" ."హరితహారం కార్యక్రమంలో సోకిందా" అంటూ వార్త ప్రచురించారు. సీఎం కేసీఆర్ ఎక్కడ? తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం జాడ ఏదంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నలు, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్

సీఎం కేసీఆర్ జలుబు తదితర లక్షణాలతో బాధపడుతున్నాడని, క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారని, ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా (Pragati Bhavan) అంటూ ఆ వార్తలో  రాశారు. ఈ విషయాన్ని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న మహ్మద్ ఇలియాస్ అనే టీఆర్ఎస్ కార్యకర్త (TRS activist) చూశాడు. తన స్నేహితులతో వాకబు చేశారు. ఇలాంటి వార్త ఏది అధికారులు ధ్రువీకరించలేదని, తప్పుడు వార్త కావొచ్చు అని వారు చెప్పారు.

Here's Twitter Trolling 

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగించే కుట్రకు పాల్పడిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఇలియాస్ ఆదివారం రాత్రి జూజ్లీహిల్స్ పోలీసులకు (Jubilee Hills Police) ఫిర్యాదు చేశారు. దాంతో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి వెంకటేశ్వరరావుతో పాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో కొత్తగా మరో 1590 పాజిటివ్ కేసులు నమోదు, మళ్లీ హైదరాబాద్ నుంచే అత్యధికంగా 1277 కేసులు, రాష్ట్రంలో 24 వేలకు చేరువైన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య

ఇదిలా ఉంటే #WhereIsKCR అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా సోకిన దరిమిలా, కేసీఆర్ కూడా వైరస్ కాటుకు గురయ్యారని, గత నెలలో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో ఆయనకు కరోనా అంటుకుందంటూ ఓ లోకల్ పత్రికలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ రాష్ట్రమంతటా సర్క్యూలేట్ అయ్యాయి. గడిచిన రెండు రోజులుగా దీనిపైనే చర్చ కొనసాగుతున్నది. గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వంగానీ, టీఆర్ఎస్ పార్టీగానీ అధికారిక ప్రకటన చేయలేదు.

Here's Telangana Congress Tweet

Here's Jithender Reddy Tweet

దీంతో నిన్న అంతా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిపక్ష నేతలందరూ #WhereisKcr అంశంపై మాట్లాడారు. దీనిపై ప్రభుత్వం నుంచి కాని తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ' వ్యవస్థ నుంచి కాని ఎటువంటి సమాచారం రాకపోవడంతో అందరూ అయోమయానికి గురయ్యారు. తాజాగా అరెస్టుతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడినట్లయింది. ఏడు లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, ర‌ష్యాను వెన‌క్కు నె‌ట్టేసిన‌ భార‌త్‌, కొత్తగా దేశాన్ని కలవరపెడుతున్న రాజస్థాన్, ప్రపంచవ్యాప్తంగా కోటి 15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఇదిలా ఉంటే ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ ‘పీటీఐ'.. తెలంగాణలో ఓ మంత్రికి కరోనా అంటూ మహమూద్ అలీ పేరు రాయకుండా వదిలిన వార్తను.. అదే శీర్షికతో ‘లైవ్ మింట్'అనే వెబ్ సైట్ జూన్ 29న ఓ కథనాన్ని ప్రచురించింది. డిప్యూటీ సీఎం ఫొటోకు బదులుగా సీఎం కేసీఆర్ ఫొటోను వాడటంతో అక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది. కాగా, జూబ్లీ హిల్స్ పోలీసుల విచారణలో.. ఆ వార్త రాసింది తాను కాదని ఆదాబ్ హైదరాబాద్ ఎడిటర్ వెంకటేశ్వరావు చెప్పారని, దీంతో రాసిన వ్యక్తి కోసం గాలింపు చర్య చేపట్టారని ప్రముఖ తెలుగు చానెళ్లలో వార్తలు వచ్చాయి. ‘‘నేను సేఫ్ గా ఉన్నాను, తప్పుడు వార్త రాయలేదని పోలీసులకు చెప్పాను. మీరెవరూ హైదరాబాద్ రావొద్దు.. నేనే వచ్చేస్తున్నా..''అంటూ వెంకటేశ్వరావు తన స్నేహితులతో మాట్లాడిన ఆడియో కూడా నిన్నంతా వైరల్ అయింది.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

PM Modi Unveils Rs 2 Lakh Crore Projects: రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన భారత ప్రధాని

CM Chandrababu on PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన సీఎం చంద్రబాబు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడంటూ కితాబు, రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

California Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు, లాస్ ఏంజిల్స్‌లోని ది పాలిసేడ్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మంటలు

CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం

Share Now