New Delhi, July 6: దేశంలో గడిచిన 24 గంటల్లో సుమారు 25 వేల పాజిటివ్ కేసులు (India Coronavirus Update) నమోదవగా 613 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి చేరింది. అయితే అదేరోజు సాయంత్రం నాటికి మరిన్ని కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 లక్షలుగా (India Coronavirus Report) నమోదైంది. దీంతో 6.8 లక్షల కేసులున్న రష్యాను (Russia) వెనక్కునెట్టి ప్రపంచంలో కరోనా ప్రభావిత జాబితాలో భారత్ (India) మూడో స్థానానికి ఎగబాకిందని అమెరికాలోని (America) జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.అమెరికా(28 లక్షలు), బ్రెజిల్(15 లక్షలు) తర్వాత స్థానంలో భారత్ నిలిచింది.
ఒక్క మహారాష్ట్రలోనే (Maharashtra) పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల మార్కును దాటడం ఇండియాను కలవరపరుస్తోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో మొత్తం మరణాల సంఖ్య 19,268కు చేరగా రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. దేశంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 5 వరకు 99,69,662 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఆదివారం 1,80,596 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది. హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి విరుగుడు మందు, ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి.., భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మీద క్లినికల్ టెస్టులు వేగవంతం చేసిన ఐసీఎంఆర్
రాజస్థాన్‌లో (Rajasthan) ఇప్పటివరకు అత్యధికంగా ఒక్కరోజులో ఏకంగా 632 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా ప్రతాప్‌గఢ్‌లో గరిష్టంగా 65, జోధ్‌పూర్, బీకానెర్‌లో 57 చొప్పున, జైపూర్, అల్వార్‌లో 47 చొప్పున, పాలిలో 46, జలోర్‌లో 41, రాజ్‌సమంద్‌లో 37, భరత్‌పూర్‌లో 34, అజ్మీర్‌లో 31, నాగౌర్‌లో 30, ధోల్‌పూర్‌లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో వలస కార్మికుల కారణంగా కరోనా వ్యాప్తి చెందుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 15,928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 80 శాతానికి పైగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యాక్టివ్ కేసు సంఖ్య 3780గా ఉండగా, మృతుల సంఖ్య 500కు చేరువలో ఉంది. అమెరికాలో ఒక్కరోజే 50 వేలకు పైగా కొత్త కేసులు, బ్రెజిల్‌లో 60 వేలు దాటిన కోవిడ్-19 మృతుల సంఖ్య, ప్రపంచవ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా (Global Coronavirus) కరోనా బాధితుల సంఖ్య కోటి 15 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,15,57,810 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,36,786 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 65,35,598 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల తీవ్రత నానాటికి పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 29,82,928 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,32,569 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 12,89,564 మంది కోలుకున్నారు. ఇక బ్రెజిల్‌తో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 16,04,585 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 64,569 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 9,78,615 మంది కోలుకున్నారు.