Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం
కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఇటు పటాన్‌చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి.
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికించాయి. కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఇటు పటాన్‌చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమై.. వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. మరో 5 రోజులు తెలంగాణకు ఎల్లో అలర్ట్, దంచి కొట్టిన వానలకు హైదరాబాద్ నగరం విలవిల, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా కనగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 9 సెం.మీ, షేక్‌పేటలో 8.7 సెం.మీ. వర్షం కురిసింది. ఖైరతాబాద్, కోఠి, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్, బాలానగర్, అల్వాల్, శేరిలింగంపల్లి, గోల్కొండ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది.
Here's Videos
యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్, మలక్‌పేట మెట్రోస్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట, ఎర్రగడ్డ, రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా కూకట్‌పల్లి-ఎల్బీనగర్, సికింద్రాబాద్-మలక్‌పేట, చార్మినార్-గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మలక్‌పేట ఆర్‌యూబీ కింద భారీగా వరద చేరడంతో కోఠి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకూ రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది.