Hyderabad Rains: భయంగొల్పుతున్న మూసి నది ఉగ్రరూపం వీడియోలు, వరద నీటిలో మునిగిపోయిన మూసారంబాగ్‌ బ్రిడ్డి, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఈ క్రమంలో మూసి నది (Evacuation begins near Musi river) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది.

Rain alert hyderabad-police-warning-citizens ( Photo-Twitter)

Hyd, July 27: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది (Evacuation begins near Musi river) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్‌ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్‌ చేస్తూ వేరే రూట్స్‌లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వానలే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, గత అర్థరాత్రి హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షాలు

భారీ వరద ప్రవాహంతో మూసీ నది(Musi river) ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌ (Osmansagar), హిమాయత్‌సాగర్‌ (Himayath sagar), హుస్సేన్‌సాగర్‌ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. మూసారంబాగ్‌, చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.

Here's Musi River Floods Videos

భాగ్యనగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి అధికంగా ఉంది. ఉస్మాన్ సాగర్‌లోకి 8000 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ అవుట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ నుంచి 13 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1789.10 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్‌కు 9000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్‌సాగర్ 8 గేట్ల ద్వారా మూసీలోకి 10700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులకు గాను... ప్రస్తుతం నీటిమట్టం 1762.45 అడుగులకు చేరింది.



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం