Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వానలే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, గత అర్థరాత్రి హైదరాబాద్‌ను కుమ్మేసిన భారీ వర్షాలు
Representational Image | (Photo Credits: PTI)

Amaravati, July 26: రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మూడ్రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rain Alert ) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం (Telangana Rains) ఉందని పేర్కొంది.

రేపు (జులై 27) ఉమ్మడి వరంగల్ జిల్లా, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, జగిత్యాల, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, వికారాబాద్, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో సోమవారం అర్థరాత్రి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాదులో 100 మిమీ వర్షపాతం నమోదైంది.

మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే, భాగ్యనగరాన్ని అర్థరాత్రి ముంచెత్తిన భారీ వర్షాలు, మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసిన అధికారులు

ఇక, ఏపీలో రేపు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Andhra Pradesh Rains) కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ, ఉభయగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వివరించింది.