Hyderabad Road Accident: ఘోర ప్రమాదం, అతివేగంతో వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన అంబులెన్స్, వెంటనే పేలిన ఆక్సిజన్ సిలిండర్, డ్రైవర్ మృతి
మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్ బీఎన్ రెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది.
BN Reddy Nagar, July 25: హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగిని అతడి ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి వస్తుండగా అంబులెన్స్ బీఎన్ రెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ మహేశ్ (35) మృతిచెందాడు. నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ వీడియో ఇదిగో, కదిలే లోపు రెండు గంటలు సినిమా చూడవచ్చు
సాగర్ రహదారిపై బీఎన్ రెడ్డి చౌరస్తా వద్ద డివైడర్‌ను అంబులెన్స్ ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొట్టడంతో వాహనం బోల్తాపడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో అంబులెన్స్ ధ్వంసమైంది.
Here's Video
ఈ క్రమంలో డ్రైవర్ మృతి చెందడంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.