Hyderabad Shocker: చదువు ఒత్తిడి భరించలేక పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య, స్ట్రెస్‌ తట్టుకోలేకపోతున్నా నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులకు లేఖ, మియాపూర్ లో విషాదకర ఘటన

మియపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన (Hyderabad Shocker)చోటు చేసుకుంది.చదువు ఒత్తిడి తట్టుకోలేక పదవ తరగతి విద్యార్థిని హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య (10th Class Student Committed Suicide) చేసుకుంది.

Representational Image (Photo Credits: File Image)

Miyapur, Feb 6: మియపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన (Hyderabad Shocker)చోటు చేసుకుంది.చదువు ఒత్తిడి తట్టుకోలేక పదవ తరగతి విద్యార్థిని హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య (10th Class Student Committed Suicide) చేసుకుంది. మియాపూర్ ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్‌ టవర్స్‌లో నివాసముంటోంది. వారి కుమార్తె సంజన(14) పటాన్‌చెరు బీరంగూడలోని అకడమిక్‌ పబ్లీక్‌ స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది.

భార్యను చంపి రాత్రంతా పక్కన పడుకున్న భర్త, తెల్లారి శవాన్ని పూడ్చి ఆ సమాధిపై పంటను వేసిన కసాయి, యూపీలో దారుణ ఘటన వెలుగులోకి..

ఆమె తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శుక్రవారం సంజన పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయితే చాలా సేపటి వరకు సంజన బయటికి రాకపోవడంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్‌లు తలుపులు తట్టగా లోపలి నుంచి రెస్పాన్స్ లేదు.

అర్థరాత్రి నగ్నంగా తలుపులు కొడుతూ మహిళ హల్ చల్, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగడం చూసి జనాలు షాక్, సోషల్ మీడియాలో సీసీ టీవీ పుటేజీ వైరల్

వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సంజన సీలింగ్‌ ప్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఆమె గదిలో ఓ పేపర్‌పై హాయ్‌ అమ్మా... నాన్న.. మోహిత్‌ నేను అసలు ఈ మెంటల్ స్ట్రెస్‌ తీసుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్‌ యూ అని రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. చదువులో ఒత్తిడి భరించలేకే (Stress) ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.



సంబంధిత వార్తలు