Hyderabad Shocker: న్యూడ్ వీడియోలో ఉన్నావంటూ నకిలీ పోలీసులు బ్లాక్ మెయిల్, డిలీట్ చేయాలంటే రూ. 35 వేలు ఇవ్వాలని డిమాండ్, శంషాబాద్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

హ్యాకర్లు ఇంటర్నెట్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన పడి చాలామంది తమ డబ్బును కోల్పోతున్నారు. తాజాగా శంషాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫేక్ పోలీసులు (Fake police Blockmail man) ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ. 35, 500 పిండుకున్నారు.

Cybercrime (Photo Credits: IANS)

Hyd, Dec 9: దేశంలో రోజు రోజుకు సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు ఇంటర్నెట్ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన పడి చాలామంది తమ డబ్బును కోల్పోతున్నారు. తాజాగా శంషాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫేక్ పోలీసులు (Fake police Blockmail man) ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ. 35, 500 పిండుకున్నారు. వివరాల్లోకెళితే.. శంషాబాద్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ఈ ఫేక్ పోలీసులు ఫోన్ చేసి మీ న్యూడ్ వీడియో మా దగ్గర ఉందని అది సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలంటే నగదు పంపాలని బ్లాక్ మెయిల్ చేశారు.

షాకింగ్ వీడియో, 100 మందితో యువతిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఇదే, అడ్డువచ్చిన తల్లిదండ్రులను కర్రలతో గాయపరిచిన 100 మంది యువకులు

ఈ 30 ఏళ్ల వ్యక్తి భయపడి వారికి రెండు ధపాలుగా వారికి రూ. 35,500 సమర్పించుకున్నారు. అతడిని సంప్రదించిన ఫేక్ పోలీసులు తమను తాము సైబర్ క్రైమ్ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. మీద న్యూడ్‌గా ఉన్న వీడియోను ('nude' video) సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని దాన్ని డిలీట్ చేయాలంటే నగదు ఇవ్వాలలని డిమాండ్ చేశారు. అలాంటి వీడియో ఉందని అతడిని ఒప్పించి నిందితులు ఆ మొత్తాన్ని రెండు విడతలుగా స్వాధీనం చేసుకున్నారు. మోసగాళ్లు తనపై వేధింపులు కొనసాగించడంతో ఆ వ్యక్తి శంషాబాద్‌ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ యువతి కిడ్నాప్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి, 100 యువకులతో కలిసి యువతిని ఎత్తుకెళ్లిన లవర్, గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెబుతున్న యువతి తల్లిదండ్రులు

శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ.. మోసగాళ్ల నుంచి నవంబర్ 28 నుంచి అతనికి కాల్స్ వస్తున్నాయని గురువారం TOIకి తెలిపారు. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో ఉందా అని అడగ్గా తేలీదని చెప్పాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.