Hyderabad Shocker: హైదరాబాద్‌లో సీన్ రివర్స్, పెళ్లి చేసుకోమన్న ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన యువతి, నరాలు తెగడంతో 50 కుట్లు, నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి (Woman Stabs Boyfriend) చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Representative Image Murder ( Photo Credits : Pixabay

Hyd, Dec 9: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి (Woman Stabs Boyfriend) చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

హైదరాబాద్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్‌ కేపీహెచ్‌బీ (KBHB) కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య కూడా అదే రోడ్డులోని ఓ మహిళా హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ వేటలోనే ఉంది. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న టీ స్టాల్‌ వద్ద మొదలైన పరిచయం స్నేహంగా మారింది.

తమిళనాడులో దారుణం, ప్రభుత్వ స్కూల్ టాయ్‌లెట్లో పసికందు మృతదేహం, కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మార్చుకున్నాడు అశోక్. ఈ మధ్యనే ప్రేమిస్తున్నానని, వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పిన అశోక్‌ ఆమె ఖర్చులు కూడా భరిస్తూ వస్తున్నాడు. ఈ నెల 5 వ తేదీన అశోక్ పుట్టిన రోజు కావడంతో ఇద్దరూ రాత్రి 7 గంటల ప్రాంతంలో టీ స్టాల్ వద్ద కలిశారు.మళ్ళీ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో వారిద్దరి మధ్య మాటమాట పెరిగింది. బాయ్‌ఫ్రెండ్, మద్యం మత్తులో ఉన్నాడని, గొడవ తర్వాత ఆమెను చెంపదెబ్బ కొట్టాడని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న మినీ కట్టర్‌ తో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్‌ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్రగాయమైంది.

బీహార్‌లో తల్లి అంత్యక్రియలపై ఇద్దరు కొడుకులు కొట్లాట, ఆమె రెండు మతాల వారిని పెళ్లి చేసుకోవడమే కారణం, చివరకు హిందూ మతం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

పదునైన బ్లేడ్‌తో బలంగా దాడి చేయడంతో అశోక్‌ చెంపపై భాగంలో లోతైన గాయమైంది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంతమేరకు పెరాలసిస్‌ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేసి (Arrested) రిమాండ్‌కు తరలించారు.