Telangana: పెళ్లి కాలేదని యువకుడు, పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య, తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటనలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈ విషాదకర ఘటన కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న మైనుద్దీన్ కుమారుడు సయ్యద్ మోహినుద్దీన్ టెక్నీíÙయన్‌గా పని చేస్తున్నాడు.
Hyderabad, August 18: భాగ్యనగరంలోపెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున్‌రెడ్డి వివరాల ప్రకారం.. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న మైనుద్దీన్ కుమారుడు సయ్యద్ మోహినుద్దీన్ టెక్నీíÙయన్‌గా పని చేస్తున్నాడు. పెళ్లికావడం లేదని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య (Hyderabad Technician ends life) చేసుకున్నాడు. తండ్రి మోహినుద్దీన్ ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో చోట పెళ్లి సంబంధాలు (Marital relations) చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు (Girl Suicide) పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లకొండ శిరీష(17) పదో తరగతి వరకు చదివింది. ఇంటర్‌లో చేరే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంటి వద్దే ఉంటుంది. ఈ నేపథ్యంలో శిరీషకు పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.