HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్‌ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)

వినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.

HYDRA Demolitions In Kukatpally (Credits: X)

Hyderabad, Sep 22: వినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు (Police) బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా (Hydra) మళ్లీ రంగంలోకి దిగింది. హైడ్రా బుల్డోజర్లు ఈసారి కూకట్‌ పల్లి నల్ల చెరువు ఆక్రమణలపై దృష్టి సారించాయి. 27 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆదివారం ఉదయం ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టారు హైడ్రా అధికారులు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. చెరువులోని ఎఫ్‌ టీఎల్, బఫర్‌ జోన్‌ లో ఏడెకరాలు ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌ జోన్‌ లలోని నాలుగెకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్ట్‌ మెంట్లు నిర్మించారు. అలాగే, ఎఫ్‌ టీఎల్‌ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

11 రోజుల పాటూ దీక్ష చేయ‌నున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, తిరుమ‌ల ప్ర‌సాదం అప‌చారంపై ప్రాయ‌శ్చిత్త దీక్ష

Here's Video:

కేవలం అవే కూల్చివేత

ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నివాసం ఉండే భవనాల జోలికి వెళ్లబోమని హైడ్రా ఇదివరకే  చెప్పిన విషయం తెలిసిందే.

సింహాచ‌లం ప్ర‌సాదాల‌పై తిరుమ‌ల ల‌డ్డూ ఎఫెక్ట్, అన్ని ప్ర‌సాదాల‌ను టెస్టింగ్ కోసం పంపించాల‌ని నిర్ణ‌యం 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif