Hydra Demolitions List: హైదరాబాద్ లో హైడ్రా దూకుడు, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు స్వాదీనం చేసుకున్నారో తెలుసా? ఎన్ని భవనాలు కూల్చారంటే?
Hyderabad, SEP 11: హైడ్రా (Hydra) దూకుడు మీదుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసింది? ఎన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుంది? ఈ జాబితాను హైడ్రా రిలీజ్ (Hydra Demolitions List) చేసింది. ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసింది. 117.2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ (GHMC) శాఖల సహకారంతో ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. జూన్ 27వ తేదీన ఖైరతాబాద్ నియోజకవర్గం లోటస్ పాండ్ ప్రాంతంలో పార్కులో వెలసిన గోకుల్ నార్ని అనే వ్యక్తి చేసిన ఎంక్రోచ్ తొలగించిన హైడ్రా.. పలువురు ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చివేసింది. 13 విల్లాలను కూల్చివేసి 2.50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.
HMDA Services: హెచ్ఎండీఏ సేవలకు అంతరాయం , ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయిన ఆన్‌లైన్ సేవలు
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా (Hydra) దూసుకెళ్తోంది. చెరువులు, నాలాల కబ్జాలపై ఫోకస్ చేసిన హైడ్రా.. ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దాదాపు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. తద్వారా 117 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుంది.
చెరువులు, నాలాలు, రోడ్లను కబ్జా చేసి వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా మొత్తం 117.2 ఎకరాల భూములు స్వాధీనం అయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా అమీన్ పూర్ చెరువులో అత్యధికంగా 51 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో 7 ఎకరాలు, 8 ఎకరాల భూములను కూడా స్వాధీనం చేసుకుంది హైడ్రా.