Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Credits: Istock

Vijayawada, Dec 13: తెలంగాణను (Telangana) చలిపులి (Coldwaves) వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది. చలిగాలులు తీవ్రంగా ఉండనుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని, ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలని, ఆరోగ్యంపట్ల జాగ్రత్తవహించాలని సూచించింది.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, మిలియన్ల మంది యువకులు పెద్ద కలలు కనడానికి నీ విజయం ప్రేరణ అంటూ ట్వీట్

ఈ జిల్లాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో శనివారం ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 5 డిగ్రీల సెల్సియస్‌ స్థాయికి పడిపోవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలో డిసెంబర్ 15 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని అప్రమత్తం చేసింది.

వీడియో ఇదిగో, నా డ్రీమ్ కోసం పదేళ్లుగా కలలు కన్నా, ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించగానే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్



సంబంధిత వార్తలు

Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి

Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Mandakrishna Madiga: కేబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలి, మాదిగలంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు తగదన్నమందకృష్ణ మాదిగ,తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్న?

Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు