Heat Wave Alert: తెలంగాణలో వచ్చే 4 రోజులు మండిపోనున్న ఎండలు, 13 జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రుతుపవనాల రాక ఆలస్యమే కారణం
సాధారణంగా ప్రతి సీజన్‌లో జూన్ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి.అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది.
సాధారణంగా ప్రతి సీజన్‌లో జూన్ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి.అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో రాష్ట్రంలో మంగళవారం నుంచి వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నదంటూ పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్, మే నెలల్లో వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ లు జారీ చేయడం మామూలే. కానీ, ఈసారి అసాధారణంగా జూన్ మొదటి వారంలో ఐఎండీ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 13 జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు బెంగాల్, ఛత్తీస్ గఢ్, సిక్కింలలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ముంచుకొస్తున్న బైపార్జోయ్ తుఫాను ముప్పు, అరేబియా సముద్రంలో 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం
వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక జూన్ 7 (బుధవారం) సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు, జూన్ 8, 9 తేదీలలో అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, అదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితులలో బయటకు వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొన్నది.
కేరళ తీరం వైపుగా రుతుపవనాల కదలికలు స్తంభించిపోవడానికి అరేబియా సము ద్రం ఆగ్నేయ ప్రాంత గగనతలంపై 5.8 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి కారణం. మరో 24 గంటల వ్యవధిలో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నది. క్రమంగా ఈ నెల 8 నాటికి తుఫాన్‌గా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం రుతుపవనాల కదలికలపై ఉంటుంది. ఈ పరిస్థితులు కేరళ తీరం వైపునకు నైరుతి రుతుపవనాల పురోగతిని తీవ్రంగా ప్ర భావితం చేసే అవకాశం ఉన్నదని అంచనా వే సింది. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొన్నది.