Documents Missing: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. ఖండించిన తలసాని ఓఎస్డీ కల్యాణ్
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో ఈ ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు.
Hyderabad, Dec 10: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) కార్యాలయంలో పలు కీలకమైన దస్త్రాలు అదృశ్యమయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఓఎస్డీ కల్యాణ్ కార్యాలయంలో ఈ ఫైల్స్ (Files) మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మాసాబ్ ట్యాంక్ లో ఈ కార్యాలయం ఉంది. ఓఎస్టీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్ లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిటికీ గ్రిల్స్ తొలగించి పైల్స్ ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆఫీస్ లో చెల్లాచెదురుగా ఫైళ్లు పడి ఉండడం అందులో ముఖ్యమైన ఫైళ్లు లేకపోవడంతో అధికారులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓఎస్టీ ఏమన్నారంటే?
దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ బృందం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలువురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఫైళ్లు మాయమైనట్లు వస్తున్న వార్తలను కల్యాణ్ కొట్టిపారేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఫైల్స్ మార్పిడిపై అసత్య ప్రచారం సాగుతోందన్నారు.