Satvik Death Case: సాత్విక్ ఆత్మహత్య, సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి,వార్డెన్లపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబిత

File image of Minister Sabitha Indra Reddy | File Photo.

Hyd, Mar 1: హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి సాత్విక్‌ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు.

దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ పేరెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ చైతన్య కాలేజీలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య, సంచలన విషయాలు వెలుగులోకి, గతంలో లెక్చరర్ కొట్టడంతో 15 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడని తల్లిదండ్రుల ఆరోపణలు

తమకు న్యాయం చేయాలంటూ శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్‌, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్‌ మృతిచెందాడని పేరెంట్స్‌ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్‌ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్‌ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్‌ చేసి కొడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్‌ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

రాజస్థాన్‌లో దారుణం, రోడ్డు మీద వెళుతున్న విద్యార్థినులను వదలని కామాంధులు, బలవంతంగా ముద్దులు పెడుతూ అత్యాచారయత్న ప్రయత్నం, వీడియో సోషల్ మీడియాలో వైరల్

సాత్విక్ మృతికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు కాలేజీ ముందే బైఠాయించి న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు.నార్సింగ్ కార్పొరేట్ కళాశాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కాలేజీ ముందు ఆందోళనల రీత్యా ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు.

 



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు