IPS Transfers In Telangana: తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీ, మ‌హేష్ భ‌గ‌వ‌త్, స్వాతి ల‌క్రా, స్టీఫెన్ ర‌వీంద్ర సహా ప‌లువురు సీనియ‌ర్ల ట్రాన్స్ ఫ‌ర్

ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ (Mahesh Bhavath) బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా (Swati lacra), గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు.

Telangana Govt Logo

Hyderabad, July 10: తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ (IPS  Officers Transfer) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ (Mahesh Bhavath) బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా (Swati lacra), గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్‌ సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

టీజీఎస్పీ బెటాలియన్‌ అదనపు డీజీగా సంజయ్‌ కుమార్‌ జైన్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషి, మల్టీజోన్‌-1 ఐజీగా ఎస్‌ చంద్రశేఖర్‌రెడ్డి, రైల్వే, రోడ్‌స్టేఫ్టీ ఐజీగా కే రమేశ్‌ నాయుడు, మెదక్‌ ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్‌ గిరిధర్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బీ బాలస్వామి, వెస్ట్‌జోన్‌ డీసీపీగా జీ చంద్రమోహన్‌, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ డీసీపీగా రక్షితమూర్తి నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Fire Accident in UP: ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

Cocaine worth Rs 900 crore seized: ఢిల్లీలో భారీ ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌, ఏకంగా రూ. 900 కోట్ల విలువైన కొకైన్, ఇత‌ర మాద‌క ద్ర‌వ్యాలు సీజ్

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?