IT Raids At Real Estate Firms: ప్ర‌ముఖ‌ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌పై ఇన్ క‌మ్ ట్యాక్స్ దాడులు, పేరుమోసిన బిల్డ‌ర్ల ఇళ్ల‌లో విస్తృత సోదాలు

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారు (Real Estate)ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

Income Tax (Photo-IANS)

Hyderabad, OCT 17: హైదరాబాద్‌లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారు (Real Estate)ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురిలోని గూగి ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలపర్స్ కార్యాలయంతోపాటు, మలక్‌పేటకు చెందిన కాంగ్రెస్‌ నేత షేక్‌ అక్బర్‌ ఇండ్లలో, అతని 15 గూగి ప్రాపర్టీస్‌ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా, డీఏను 3 శాతం పెంచిన మోదీ సర్కారు, ప్రస్తుత పెంపుతో 50 శాతం నుండి 53 శాతానికి డియర్‌నెస్ అలవెన్స్ 

అన్విత బిల్డర్స్‌ అధినేత బొప్పన అచ్యుతరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూస్‌ ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, ఎవ్వరిని బయటికి వెళ్లనీయకుండా పటిష్టమైన భద్రత నడుమ సోదాలు నిర్వహిస్తున్నారు.