IT Raids: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు, 100 బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న అధికారులు, రూ. 40 కోట్ల ఐటీ స్కామ్‌ కు సంబంధించి సోదాలు చేస్తున్నట్లు వార్తలు

గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.

Income Tax (Photo-IANS)

Hyderabad, OCT 05: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు (IT Raids) జరుగుతున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 100 టీమ్స్ తో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) తోపాటు కూకట్ పల్లిలోని ఆయన సోదరుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఇదిగో, మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు, సెప్టెంబర్ 28 నాటికి కొత్త ఓటర్ల సంఖ్య 17,01,087 

గత జూన్ లో హైదరాబాద్ లో ఐటీ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. రూ. 40 కోట్ల రూపాయల స్కామ్ ను ఐటీ అధికారులు బయటపెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. తాజాగా నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.