Deadline For Ration Card E-KYC: తెలంగాణ‌లో రేష‌న్ కార్డు ఉందా? అయితే జ‌న‌వ‌రి 31 లోగా ఈ ప‌నిచేయ‌క‌పోతే మీ కార్డు గ‌ల్లంతే!

అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోగా, మరికొందరు పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లించారు. మరికొందరు పెండ్లి తర్వాత కొత్తకాపురాలు పెట్టారు.

Telangana Govt Logo

Hyderabad, DEC 31: తెలంగాణ‌లో రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్‌డేట్‌ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను త్వ‌ర‌లో ముగించనుంది. లబ్ధిదారులు కేవైసీని సమర్పించేందుకు జనవరి 31 వరకు తుదిగడువు ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీచేశారు. బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నో యువర్‌ కస్టమర్‌’ (KYC) పేరుతో రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Abhayahastam Clarifications: అభయహస్తం దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు.. ప్రభుత్వ వర్గాల క్లారిటీ ఏంటంటే?? 

2014 నుంచి రాష్ట్రంలో రేషన్‌ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. అయితే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోగా, మరికొందరు పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లించారు. మరికొందరు పెండ్లి తర్వాత కొత్తకాపురాలు పెట్టారు. ఈ నేపథ్యంలో రేషన్‌ బియ్యం పక్కదారిపట్టకుండా ప్రభుత్వం కేవైసీ నిర్వహిస్తున్నది. ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది. దీంతో గత రెండు నెలలుగా రేషన్‌ దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. దీనికోసం ఆధార్‌ కార్డు, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు.

TSRTC Tickets: ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి అమల్లోకి  

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.80 శాతం ఈ-కేవైసీ పూర్తయింది. ఇందులో 87.81 శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 54.17 శాతం వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో కేవైసీకి తుదిగడువు విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Pushpa 2 stampede: సంధ్య థియేటర్ విషాదం...రేవతికి 11వ రోజు కర్మ నిర్వహించిన కుటుంబ సభ్యులు, కోలుకుంటున్న చిన్నారి శ్రీ తేజ్