Jaya Jayahe Telangana: జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ ఇవేనా ? తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా
ఒరిజినల్ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన లేకుండా కొత్త వెర్షన్ సాంగ్ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు.
జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ వచ్చేశాయి. ఒరిజినల్ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన లేకుండా కొత్త వెర్షన్ సాంగ్ వచ్చింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్అ వుతోంది.
ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా.. 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెండు గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు.
తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై 200 వరకు సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్నీ విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమల్లో అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
Here's News
దీనిపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చర్చించారు. కొన్ని నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. వీటిని మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి, వారి సలహాలు, సూచనలు కూడా స్వీకరించి.. తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు ఇవ్వనున్నారు.