Telangana Assembly Election 2023: ఓటు వేసేందుకు వచ్చిన అల్లు అర్జున్, మొరాయించిన ఈవీఎం, 40 నిమిషాల పాటూ క్యూ లైన్ లోనే ఉండి ఓటు వేసిన సినీ ప్రముఖులు
జూబ్లీహిల్స్ క్లబ్‌లో సుమంత్ ఓటు వేశారు. మరోవైపు మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్‌లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఓటు వేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
Hyderabad, NOV 30: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. (Telangana Elections 2023) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. నటులు ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్‌లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ వచ్చారు.
అల్లు అర్జున్ బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో ఈవీఎం మొరాయించడంతో దాదాపు 40 నిమిషాల పాటూ వేచి ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన క్యూ లైన్ లోనే ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ క్లబ్‌లో సుమంత్ ఓటు వేశారు. మరోవైపు మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్‌లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఓటు వేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నగర ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని రొనాల్డ్ రోస్ కోరారు.