Telangana Assembly: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్, ఇవాళ ఒక్కరోజే హాజరవుతారా?

ఇక ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాసేపటి క్రితమే బడ్జెట్‌కు అమోదం తెలిపింది కేబినెట్. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

kcr assembly(BRS X)

Hyd, July 25:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాసేపటి క్రితమే బడ్జెట్‌కు అమోదం తెలిపింది కేబినెట్. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.

ఇక తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ సర్కారే ఉండటం, సీఎంగా పనిచేసిన కేసీఆర్, తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే అంశాన్ని సభలో పదేపదే ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీకి రావాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే కేసీఆర్ ఇవాళ ఒక్కరోజే సభకు హాజరవుతారా, బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు 6 నెలల్లో కనీసం ఒక్కరోజైనా సభకు హాజరుకావాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారా అన్న టాక్ నడుస్తోంది. అసెంబ్లీ లాబీ లో ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు చాంబర్ కేటాయించారు. ఈ చాంబర్ ఇరుకుగా ఉందని ఇప్పటికే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన చాంబర్‌లో కేసీఆర్ ఆసీన్నులవుతారా లేదా అన్నది వేచిచూడాలి.

ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ ముగియగానే కాళేశ్వరం పర్యటనకు బయలుదేరనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నారు.  మేడిగడ్డకు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్న గులాబీ నేతలు, షెడ్యూల్ ఇదే

 



సంబంధిత వార్తలు