KTR Meeting: లోక్ సభకు రెడీగా ఉందాం! జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక సమావేశం
ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడొద్దని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
Hyderabad, DEC 21: లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కలిసికట్టుగా పని చేద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో (GHMC) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ (BRS) విజయానికి కృషి చేసిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలో బీఆర్‌ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడొద్దని సూచించారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. హామీలు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.