KTR on NDA: ఎన్డీయేపై మంత్రి కేటీఆర్ సెటైర్స్, ఎన్డీయే అంటే నో డాటా అవైలెబుల్ అంటూ ట్వీట్, రైతు మరణాలపై కేంద్రం స్పందించిన తీరును తప్పబట్టిన విపక్షాలు

ఎన్డీయే(NDA) అంటే నో డాటా అవైలబుల్(No Data Available) అంటూ ట్వీట్ చేశారు. రైతు ఆందోళనల్లో మరణించిన వారి రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లోక్‌సభ(Loksabha)లో రాతపూర్వక సమాధానం ఇవ్వడంపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

TRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

Hyderabad December 02: కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరాలు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR). ఎన్డీయే(NDA) అంటే నో డాటా అవైలబుల్(No Data Available) అంటూ ట్వీట్ చేశారు. రైతు ఆందోళనల్లో మరణించిన వారి రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లోక్‌సభ(Loksabha)లో రాతపూర్వక సమాధానం ఇవ్వడంపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

గ‌తంలో కూడా ప‌లు అంశాల‌ను విప‌క్షాలు ప్రస్తావిస్తే.. జ‌వాబు చెప్పకుండా దాట‌వేత ధోర‌ణి ప్రద‌ర్శించారని కేంద్రంపై మండిపడ్డారు. వాటిలో కొన్ని అంశాల‌ను మంత్రి కేటీఆర్ లేవ‌నెత్తుతూ.. ఎన్డీఏ అంటే నో డాటా అవేల‌బుల్ అని ట్వీట్ చేశారు.

NDA = No Data Available Govt

NO Data of Healthcare staff who died

NO Data of MSMEs closed due to Covid

NO Data on Migrant workers’ deaths

NO Data on job loss during pandemic

NO Data on Beneficiaries of ₹20 Lakh Cr package

NO Data of Farmers’ deaths in Farm law protest pic.twitter.com/dGuwsse4QD

— KTR (@KTRTRS) December 1, 2021

కేంద్రం వ‌ద్ద చ‌నిపోయిన ఆరోగ్య కార్యక‌ర్తల లెక్కలుండ‌వు. క‌రోనా(Corona) వ‌ల్ల మూత‌ప‌డ్డ ప‌రిశ్రమ‌ల లెక్కలుండ‌వు. వ‌ల‌స కూలీల మ‌ర‌ణాల‌పై లెక్కలుండ‌వు. క‌రోనాతో ఉపాధి కోల్పోయిన వారి లెక్కలుండ‌వు. కేంద్రం ప్రక‌టించిన రూ. 20 ల‌క్షల కోట్ల ప్యాకేజీ ల‌బ్ధిదారుల లెక్కలుండ‌వు. రైతు ఆందోళ‌న‌ల్లో మృతి చెందిన అన్నదాత‌ల మ‌ర‌ణాల‌పై లెక్కలుండ‌వు అని కేటీఆర్ త‌న ట్వీట్‌(Tweet)లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు కొన్ని జాతీయ మీడియా క్లిప్పుల‌తో పాటు లోక్‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల‌కు సంబంధించిన నోట్‌ను ట్యాగ్ చేశారు.

Parliament Winter Session: ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాలని డిమాండ్, రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదా

ఏడాది నుంచి  సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిలో 750 మందికి పైగా రైతులు చనిపోయారని రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్ధిక పరిహారం అందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో విపక్ష ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్న అడిగారు. దీనికి రాతపూర్వక సమాధానమిస్తూ కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి స్పందించారు. తమ వద్ద రైతు ఆందోళనల్లో మరణించిన వారి రికార్డులు లేవని, దాంతో వారికి పరిహారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. దీనపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్