TRS MPs protest in Lok Sabha (Photo-Twitter)

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న స్వ‌రం పెంచారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదాప‌డ‌గా.. లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగుతున్న‌ది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాలు రాసివున్న ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ఎస్ స‌భ్యుల నినాదాల‌తో లోక్‌స‌భ హోరెత్తింది.తెలంగాణ రైతాంగాన్ని న్యాయం జ‌రిగేవ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని వారు స్ప‌ష్టంచేశారు.