CPI On Alliance With Congress: కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఐ సై, ప్రాథమిక చర్చలు జరిగాయన్న నేతలు, బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఎవరితోనైనా కలుస్తామంటూ ప్రకటన

తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది. వామపక్ష పార్టీలతో పొత్తులు లేవని బీఆర్ఎస్ (BRS) తేల్చేయడంతో కాంగ్రెస్ (Congress ) పార్టీతో పొత్తుల కోసం సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ (CPI) చర్చించినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే

Kunamneni Sambashivarao

Hyderabad, AUG 27: తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections 2023) జరగాల్సి ఉన్న వేళ పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నాలు చేస్తోంది. వామపక్ష పార్టీలతో పొత్తులు లేవని బీఆర్ఎస్ (BRS) తేల్చేయడంతో కాంగ్రెస్ (Congress ) పార్టీతో పొత్తుల కోసం సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సీపీఐ (CPI) చర్చించినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ‌ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తులతో చర్చలు జరిపామని అన్నారు. తాము జరిపింది ప్రాథమిక చర్చలేనని చెప్పారు.

Amit Shah: నేడే తెలంగాణకు అమిత్ షా.. ఖమ్మం జిల్లాలో బీజేపీ రైతు సభలో పాల్గొననున్న హోం మంత్రి.. చివరి నిమిషంలో రద్దయిన భద్రాచల రాములవారి దర్శనం షెడ్యూల్ 

తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామమని, అంతేగానీ తాము త్యాగం చేస్తామని అనుకోవద్దని తెలిపారు. తమకు బలం ఉన్న సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పాక వాటి గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోసారి సీపీఐ-సీపీఎం నాయకత్వం కూడా భేటీ కాబోతుందని అన్నారు.

Congress SC, ST Declaration: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు, ఆర్ధిక సాయం పెంచుతామంటూ హామీ, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన ఖర్గే 

తమ ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే పొత్తులతో ముందుకు వెళ్తామని చెప్పారు. అధికార పార్టీని ఓడించేందుకు తాము ఎవరితోనైనా కలుస్తామని తెలిపారు. ఇప్పుడే సంప్రదింపులు మొదలయ్యాయని అన్నారు. సీపీఐ- సీపీఎం కలిసి ఎన్నికలకు వెళ్లడం మాత్రం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ తో మరికొన్ని పార్టీల నేతలూ చర్చలు జరుపుతున్నారు. మహాకూటమి ఏర్పాటు అవుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం అవుతుందా? అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టతరాలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now