Leopard spotted in Rajendra Nagar: రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత కలకలం, సీసీటీవీ కెమెరాలో నమోదైన చిరుత కదలిక దృశ్యాలు, ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ

జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత (Leopard) సంచరించినట్టగా వీడియో బయటకు వచ్చింది. నారం ఫాంహౌస్ వద్ద ఓ ఇంటి కాంపౌండ్‌లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు, చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్‌ వద్ద మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

leopard-attack (Photo Credits: Uttarakhand forest department)

Hyderabad, June 9: గతంలో రాజేంద్రనగర్‌లో చిరుత హల్ చల్ చేసిన ఘటన మరువక ముందే మరోసారి అక్కడ చిరుత కదలికలు (Leopard spotted in Rajendra Nagar) కలకలం రేపుతున్నాయి. జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత (Leopard) సంచరించినట్టగా వీడియో బయటకు వచ్చింది. నారం ఫాంహౌస్ వద్ద ఓ ఇంటి కాంపౌండ్‌లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు, చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్‌ వద్ద మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇద్దరు పోలీసులపై చిరుత దాడి, ఎట్టకేలకు పట్టుకున్న ఫారెస్టు అధికారులు, హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు తరలింపు

మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ దగ్గర హల్చల్ చేసింది. తర్వాత స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకుని సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌వైపు వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని అధికారులు భావించారు. ఇళ్లలో నుండి బయటకు రావొద్దు, చిరుతను పట్టుకుంటామని తెలిపిన అధికారులు, హైదరాబాద్ నగర వాసులను పరుగులు పెట్టిస్తున్న చిరుత పులి

ఆ తర్వాత రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించింది. అక్కడి నుంచి అది గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆ చుట్టుపక్కలే చిరుత పులి సంచ‌రిస్తున్న‌ట్లుగా బ‌య‌ట‌ప‌డ‌టంతో ఇటు స్థానికులు, అటు ఉద్యోగులు, అధికారులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.