Liquor Prices: తెలంగాణ మందుబాబులకు షాక్, మద్యం ధరలను పెంచుతూ సడెన్ షాక్, గురువారం నుంచి కొత్త ధరలు, వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు, వేటిపై ఎంత పెంచారంటే?
గురువారం నుంచి మద్యం ధరలు (Liquor Price) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను ప్రకటించారు. బుధవారం మద్యం అమ్మకాల తర్వాత వైన్ షాపులను (Wine Shops) ఎక్సైజ్ శాఖ (Exice) సీజ్ చేస్తుంది.
Hyderabad, May 18: మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.). గురువారం నుంచి మద్యం ధరలు (Liquor Price) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను ప్రకటించారు. బుధవారం మద్యం అమ్మకాల తర్వాత వైన్ షాపులను (Wine Shops) ఎక్సైజ్ శాఖ (Exice) సీజ్ చేస్తుంది. మిగిలిన మద్యాన్ని లెక్కించి, వాటిని కొత్త ధరలకు అమ్మేలా చూస్తారు. గురువారం నుంచి పెరిగిన ధరలకు మద్యం అమ్మాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. అయితే, ధరలు పెంచుతూ పాత స్టాక్‌పైన భారం వేయడంపై వైన్ షాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మద్యం ప్రియులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మందుబాబులు వైన్ షాపులకు క్యూ కట్టారు. దీంతో షాపుల్లో నో స్టాక్ బోర్టులు దర్శనమిస్తున్నాయి. అటు కొన్ని ప్రాంతాల్లో మందుబాబు అసహనం వ్యక్తం చేశారు.
బ్రాండ్లతో సంబంధం లేకుండా ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ బాటిల్ పై రూ. 20 పెంచనుండగా, హాఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ మద్యంపై రూ. 80 పెంచాలని నిర్ణయించింది. అలాగే బీర్ల ధరలను కూడా రూ. 20 పెంచుతున్నట్లు ప్రకటించింది.